Share News

AP State Water Resources Dept: బనకచర్లపై హేతుబద్ధ్దతతో వెళ్లండి

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:56 AM

పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకంపై దూకుడు విధానంతో కాకుండా హేతుబద్ధతతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర జల వనరుల శాఖ...

AP State Water Resources Dept: బనకచర్లపై హేతుబద్ధ్దతతో వెళ్లండి

  • జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌కు ఆలోచనాపరుల వేదిక వినతి

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పోలవరం - బనకచర్ల అనుసంధాన పథకంపై దూకుడు విధానంతో కాకుండా హేతుబద్ధతతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను ఆలోచనాపరుల వేదిక కోరింది. వెలగపూడి సచివాలయంలో గురువారం ప్రత్యేక సీఎ్‌సను వేదిక తరఫున నిఘా మాజీ అధినేత ఏబీ వెంకటేశ్వరరావు, జల వనరుల నిపుణుడు టి.లక్ష్మీనారాయణ, వ్యవసాయ రంగ నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్‌, సామాజికవేత్త నల్లబోతు చక్రవర్తి, జొన్నలగడ్డ రామారావు కలిశారు. ఈ సందర్భంగా పోలవరం - బనకచర్ల అనుసంధానంపై పొరుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రాకుండా, రాష్ట్ర జల హక్కులను కాపాడేలా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంపై అభిప్రాయాలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

Updated Date - Oct 24 , 2025 | 04:56 AM