BC Welfare Minister Savitha: గురుకుల పాఠశాలలను పెంచుతాం
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:21 AM
డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో గురుకులాలు పెంచేవిధంగా నిర్ణయం తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
కొవ్వూరు/రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో గురుకులాలు పెంచేవిధంగా నిర్ణయం తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను ఆదివారం మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014-19లో 65 గురుకుల పాఠశాలలు టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందని, మొత్తం 108 గురుకుల పాఠశాలలు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినవే అని తెలిపారు. కాగా, భవిష్యత్తులో పావలా వడ్డీకే విద్యారుణాలు ఇచ్చే యోచన కూటమి ప్రభుత్వం చేస్తోందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం రాత్రి 226 మంది శెట్టిబలిజ పదో తరగతి మెరిట్ విద్యార్థులకు గోద్రేజ్ సంస్థ సీఎస్‌ఆర్ ఫండ్స్ నుంచి స్కాలర్‌షిప్స్ పంపిణీ చేసి మాట్లాడారు.