జగన్ ఉన్మాదంలో ఉన్నారు: అశోక్‌బాబు
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:28 AM
చావుకి, పెళ్లికి ఒకే భజంత్రి అనే సామెత జగన్‌కు సరిగ్గా వర్తిస్తుందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు అన్నారు.
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): చావుకి, పెళ్లికి ఒకే భజంత్రి అనే సామెత జగన్‌కు సరిగ్గా వర్తిస్తుందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘11 సీబీఐ, 9 ఈడీ చార్జిషీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టుకు వెళ్లేటప్పుడు భారీ హడావిడి చేయడం దేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. సమయం సందర్భం లేకుండా, ఏ ప్రదేశంలో ఉన్నామన్న స్పృహ లేకుండా రప్పా రప్పా అనడం ఏమిటి? జగన్ ఉన్మాదంలో ఉన్నారు. ఈ ఉన్మాదిని నమ్ముకుని అడ్డగోలుగా మాట్లాడేవారికి ప్రజలే బుద్ధి చెబుతారు’ అని అన్నారు.