వ్యాయామంతోనే గుండె పదిలం
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:02 AM
మన గుండె ఉండేది పిడికెడే. నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. ఇటీవల కాలంలో గుండె లయ తప్పుతోంది.
ఆధునిక జీవన శైలే కారణం
చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్
నేడు వరల్డ్ హార్ట్ డే
మన గుండె ఉండేది పిడికెడే. నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. ఇటీవల కాలంలో గుండె లయ తప్పుతోంది. గుండె పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యువత, టీనేజర్లు గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఎక్కువయ్యాయి. దీర్ఘకా లిక జబ్బులతో బాధపడుతున్న వారిలో అత్యధికులు గుండె జబ్బులతో సతమతమ వుతున్నారు. కరోనా అనంతరం పరిణామాల తర్వాత చోటుచేసుకున్న జీవన శైలి, ఆహా రపు అలవాట్లులోని మార్పులు, హార్ట్‌ఎటాక్‌లకు కారణమవుతున్నాయి. గుండె జబ్బు లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2000 సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ ఫెడ రేషన ఏటా సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్‌డే నిర్వహిస్తుంది. ఈఏడాది ‘డోంట్ మిస్ బీట్ ’ అన్న నినాదాన్ని ఇచ్చింది. వరల్డ్ హార్ట్‌డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో గుండె జబ్బు లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏటా 30వేల మంది రోగులు చికిత్స పొందుతుంటారు. కర్నూలు జీజీహెచలోని కార్డియాలజి విభాగానికి 2024-25 సంవత్సరానికి 22,325 మంది ఓపీ కేసులు రాగా, ఇందులో 4,281మంది అడ్మిషన పొంది చికిత్స పొందుతుంటారు. కర్నూలు జీజీహెచకు ప్రతి రోజూ 3వేల మంది ఓపీకి వస్తుండగా.. ఇందులో 60 నుంచి 70 కేసులు హార్ట్ ఎటాక్ లక్షణాలతో చికిత్స పొందుతుంటారు. ఇందులో 25నుంచి 40ఏళ్లలోపు ఉన్నవారు ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి నెల కార్డియాలజీకి ఓపీకి 1300 నుంచి 1400 మంది రోగులు రాగా, ఇందులో 300 నుంచి 350 మంది అడ్మిషన అయి చికిత్స పొందుతుంటారు. ప్రతిఏడాది కార్డియాలజి వైద్యులు 1,235 మందికి అంజి యోగ్రామ్, 423 మందికి అంజియోప్లాస్టి చికిత్సలను డా.ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నారు.
పట్టణాల్లో ఎక్కువ
జీవనశైలిలో మార్పులే గుండెపోటుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యువతలో గుండె సమస్యలు అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాల్లోను అందరి ఆహారపు అలవాట్లు మారాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బేకరీ, జంక్‌ఫుడ్, మాంసాహారం, మసాలా, బిర్యానీలు ఎక్కువగా తింటున్నారు. దీని వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోయి ఆయాసం, నీరసం ఇతర సమస్యలకు కారణమవుతున్నాయి. గతంలో 50ఏళ్లు దాటిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. ప్రస్తుతం 25ఏళ్ల వారు సైతం దీని బారినపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో 13 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 8 శాతం మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ ప్రతిరోజు 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. యోగా, ధాన్యం చేయాలి. బచ్చలకూర, కాలిప్లవర్, టమోటా, క్యాబేజీ, క్యారెట్, పాలకూర, కూరగాయలు తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులు, మద్యపానంకు దూరంగా ఉండాలి. కొలస్ర్టాల్ స్థాయిని తగ్గించుకుని బీపీ, షుగర్ వ్యాధిని తగ్గించుకోవాలి.
ఫ సంగీతం వినాలా. పాతపాటలు మనస్సుకు ఎంతో హాయిని ఇచ్చి గుండెను ఆరో గ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు 7నుంచి 8గంటలు బాగా నిద్రపోవాలి. నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించాలి.కొర్రలు, సజ్జలు, జొన్నలు, బ్రౌన రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలు తీసుకోవాలి.
ప్రతి రోజు 30 కేసులు
కార్డియాలజి విభాగానికి ప్రతి రోజూ ఓపీ ఉంటుంది. ఓపీకి రోజూ 30 కేసులు వస్తుంటాయి. మంగళ, శుక్రవారాల్లో ఒక్కొక్కరికి ఓపీకి 200 మంది రోగులు వస్తారు. చెస్ట్ పెయిన, ఆయాసం లక్షణాలతో రోగులు రాగా, వారికి ఈసీజీ, టుడి ఇనో పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారిస్తాం.
ఫ డాక్టర్ పి.ప్రశాంత, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజి, జీజీహెచ, కర్నూలు