ఉత్కంఠభరితంగా బండలాగుడు పోటీలు
ABN , Publish Date - May 11 , 2025 | 10:51 PM
ఓర్వకల్లులోని శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు సంఘం, దాతల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర పాలపండ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.
ఓర్వకల్లు, మే 11 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లులోని శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రైతు సంఘం, దాతల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర పాలపండ్ల ఎద్దుల బండలాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ పోటీలను ఫెస్టివల్ కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి ప్రారంభించారు. మొదటి విజేతగా కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన రైతు మహిళ ఆకేపోగు వరలక్ష్మి ఎద్దులు రూ.50వేల నగదును కైవసం చేసుకుంది. రెండో విజేతగా తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన ఆంజనేయరెడ్డి ఎద్దు లు రూ.40వేలు, మూడో విజేతగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన ఎక్స్‌ఆర్మీ బోరెడ్డి నారాయణరెడ్డి ఎద్దులు రూ.30వేలు, నాలుగో విజేతగా నంద్యాల జిల్లా మిడుతూరు మండలం వీరే్‌షగౌడు రూ.2వేలు గెలుచుకున్నాయి. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, పెస్టివల్ కమిటి సభ్యులు వెంకటరమణారెడ్డి, దేవయ్య, మంగలి రవిశంకర్, నాయకులు రాంభూపాల్ రెడ్డి, లక్ష్మికాంతరెడ్డి, భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీరాములు, అల్లాబాబు, శ్రీరామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు