సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి: మీనా
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:02 AM
ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంబంధిత అంశాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతోనూ వ్యవహరించాలని ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు.
అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంబంధిత అంశాలకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతోనూ వ్యవహరించాలని ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. కొత్తగా ఎన్నికైన ఎక్సైజ్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు కుమారేశ్వరన్, ప్రధాన కార్యదర్శి బి.నర్సింహులు, ఇతర ప్రతినిధులు శ్రీలత, రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య తదితరులను మీనా అభినందించారు. ఈసందర్భంగా మీనాను ఉద్యోగసంఘాల నేతలు జ్ఞాపికతో సత్కరించారు.