Share News

Excise Department: ఎక్సైజ్‌ గజిటెడ్‌ సంఘం అధ్యక్షుడిగా కుమారేశ్వరన్‌

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:26 AM

ఎక్సైజ్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భీమవరం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎస్‌ కుమారేశ్వరన్‌ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Excise Department: ఎక్సైజ్‌ గజిటెడ్‌ సంఘం అధ్యక్షుడిగా కుమారేశ్వరన్‌

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భీమవరం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆర్‌ఎస్‌ కుమారేశ్వరన్‌ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీసత్యసాయి జిల్లా ఏఈఎస్‌ బి.నర్సింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా సునీత, ఉపాధ్యక్షులుగా బి.రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.శ్రీనివాసరావు, బాలయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా పి.రాజశేఖర్‌ గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా శ్రీధర్‌రావు, జె.రమేష్‌, అజయ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. వి.చంద్రశేఖర్‌రెడ్డి, రేణుక, సుబ్బారావు, గోవింద్‌ నాయక్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Updated Date - Jun 16 , 2025 | 04:31 AM