Share News

సర్వం సిద్ధం..

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:31 PM

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా పంద్రాగస్టు రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    సర్వం సిద్ధం..

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

జిల్లావ్యాప్తంగా 378 బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఫ్రీ

రోజుకు 50 నుంచి 60 వేల మంది ప్రయాణించే అవకాశం

ఇప్పటికే సిబ్బందికి శిక్షణ.. కొత్తగా 50మంది డ్రైవర్లు

మరో మూడు రోజుల్లో ప్రారంభం

సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా పంద్రాగస్టు రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో జిల్లా ఆర్టీసీ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. జిల్లాలోని డిపోల వారీగా రోజువారి ప్రయాణికులకు తగ్గట్టుగా కసరత్తు మొదలుపెట్టి తగిన బస్సులతో పాటు సిబ్బందిని నియమించి ఉచిత ప్రయాణానికి సర్వం సిద్ధం చేశారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. రోజుకు 1.20లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో 40శాతం మంది మహిళా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు ఆర్టీసీకి రూ. 65లక్షలు ఆదాయం వస్తోంది. ఫ్రీ బస్సు అమలైతే ఆర్టీసీకి ఆదాయం తగ్గనుంది. ప్రభుత్వమే ఫ్రీ బస్సు ఖర్చును చెల్లించనుంది. ప్రయాణికుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికుల కోసం తాగునీటి, మరుగుదొడ్ల సదుపాయం అధికారులు కల్పిస్తున్నారు.

నంద్యాల, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత ప్రయాణ సదుపాయం ప్రారంభించనుంది. జిల్లా ఆర్టీసీ అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఏడు డిపోల వారీగా రోజువారి ప్రయాణికులకు తగ్గట్టుగా కసరత్తు మొదలుపెట్టి బస్సులతో పాటు సిబ్బందిని ఉచిత ప్రయాణానికి సిద్ధం చేశారు. జిల్లాలోని ఏడు డిపోల పరంగా 493 బస్సులు.. 452 సర్వీసులు ఉండగా 378 బస్సులను ఉచిత ప్రయాణానికి కేటాయించారు. ఈలెక్కన రోజుకు జిల్లాలో 50 నుంచి 60 వేల మంది ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో పుణ్యక్షేత్రాలు ఎక్కువగా ఉండటంతో ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.

జిల్లాలో ఉచిత ప్రయాణం పరంగా...

ఫ కేటాయించిన బస్సులు : 378

ఫ పల్లె వెలుగు : 312

ఫ ఆలా్ట్ర పల్లె వెలుగు : 10

ఫ ఎక్స్‌ప్రెస్‌ బస్సులు : 56

--------------------------------------------------------------------------------------------

గుర్తింపు కార్డు..

ఐదు రకాల బస్సుల్లో మాత్రమే సదుపాయం కల్పించారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డీనరీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు సాగించొచ్చు. చదువుకునే విద్యార్థినులకు పాఠశాలలు, కళాశాలల సమయంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉచిత బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తప్పనిసరిగా ఓటర్‌, ఆధార్‌, రేషన కార్డు ఇలా ఏదో ఒకటి గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించి ప్రయాణం చేయాల్సి ఉంది.

ఇబ్బందులు తలెత్తకుండా..

మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసు కున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బస్సుల ద్వారా రోజుకు 1.65 లక్షల కిలో మీటర్లు ప్రయాణం సాగిస్తున్నారు. రోజుకు 1.20లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా.. వీరిలో 40శాతం మంది మహిళా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రోజుకు ఆర్టీసీకి రూ. 65లక్షలు ఆదాయం వస్తోంది. ఫ్రీబస్సు అమలైతే ఆర్టీసీకి ఆదాయం తగ్గనుంది. ఆర్టీసీకి ప్రభుత్వమే ఫ్రీబస్సు ఖర్చును చెల్లించనుంది. డిపోలవారీగా ఎక్కడిక్కడ 700మంది కం డెక్టర్లు, డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. కొత్తగా డైలీ వేజ్‌ కింద 50మంది డ్రైవర్లను తీసుకుని వారికి కూడా శిక్షణ ఇప్పించారు. ఇప్పటికే ఈఏడాదిలో జిల్లాకు సూపర్‌ లగ్జరీ-36, ఎక్స్‌ప్రెస్‌లు-32 కొత్త బస్సులను ప్రభుత్వం పంపించింది. ఆయా ఆర్టీసీ డిపోల్లో ప్రయాణి కుల కోసం మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు అధికారులు కల్పించారు.

ఆ బస్సులకు నో ఎంట్రీ....

నానస్టాప్‌, అంతర్రాష్ట్ర, కాంట్రాక్టు క్యారేజ్‌, ప్యాకేజీ, సూపర్‌ లగ్జరీ, స్టార్‌ లైనర్‌, ఆలా్ట్ర డీలక్స్‌, తదితర ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. ఎవరైనా టికెట్‌ కొనాల్సిందే. ఈ విషయం ప్రయాణికులు గుర్తించుకోవాలి.

ఆర్థికంగా ఎంతో ఆదా..

ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు కల్పించే ఉచిత ప్రయాణం కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేశాం. పేద, మధ్య తరగతి మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఆర్థికంగా ఎంతో ఆదా కల్పించనుంది.

ఫ రజియా సుల్తానా, ఆర్టీసీ ఆర్‌ఎం, నంద్యాల

ఉచిత ప్రయాణం మహిళలకు వరం

పంద్రాగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మహిళలకు అండగా.. సీఎం చంద్రబాబునాయుడు నిలుస్తున్నారు. ఉచిత ప్రయాణం మహిళలకు వరం లాంటిది.

ఫ పూల నాగరాజు, ఆర్టీసీ కడప రీజనల్‌ చైర్మన

Updated Date - Aug 13 , 2025 | 11:31 PM