Share News

ప్రజలు బుద్ధి చెప్పినా ..మీ తీరు మారదా..?

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:56 PM

గత ఎన్నికల్లో 151 సీట్ల నుం చి ప్రజలు 11 సీట్లలో మిమ్మల్ని కూర్చో పెట్టినా! మీ తీరు మారదా? అంటు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డిపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ మండిపడ్డారు.

 ప్రజలు బుద్ధి చెప్పినా ..మీ తీరు మారదా..?
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌

మాజీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్యే పుట్టా ఫైర్‌

మైదుకూరు రూరల్‌, జూలై 15(ఆంధ్ర జ్యోతి) :గత ఎన్నికల్లో 151 సీట్ల నుం చి ప్రజలు 11 సీట్లలో మిమ్మల్ని కూర్చో పెట్టినా! మీ తీరు మారదా? అంటు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డిపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ మండిపడ్డారు. స్థాని క టీడీపీ కార్యాలయంఓ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ గత వేసవిలో చెరువులకు నీరు నింప కూడా మున్సిపాలిటీ ప్రజలను ఎండగడితే, నా అదేశాలతో మా నాయకులు నీళ్ల ట్యాంకర్లు పెట్టి వీధులకు నీళ్లను తోలిన విషయం మరిచిపోయారా? అంటూ ప్రశ్నించారు. మీరు వందల ఎకరాల భూములను ఆక్రమించారు. అదే విధంగా పేదల భూములను పోలీసుల సాయంతో దౌర్జన్యంతో ఆక్రమించలేదా? అని ఎమ్మెల్యే పుట్టా ఆరోపించారు. మైదుకూరు మున్సి పల్‌ ఎన్నికల్లో మాకు దక్కాల్సిన చైర్మన్‌ పదవిని ,పోలీసుల సాయంతో కిడ్నాప్‌ కేసు పెట్టి మీ వ్యక్తిని చ్మైన్‌ చేయలేదా? అన్నారు. గత ఐదు ఏళ్ల వైసీపీ పాలనలో రాషా్ట్రన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేశారని, ఇప్పుడు చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యాపరాల చిన్న, అన్నవరం సుధాకర్‌రెడ్డి, సుబ్బారెడ్డి. బురుగోళ్ల చిన్న, తుపాకుల రమణ, బండి అమర్‌నాధ్‌, బీఎన్‌ శ్రీశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పంపిణీ : స్థానిక పార్టీ కార్యాలయంలో మైదుకూరు నియోజక వర్గంలోని 21 మందికి సుమారు రూ. 28 లక్షలను సీయం రిలీఫ్‌ ఫండ్‌ను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే బాధితులకు అందించారు. ఆపదలో ఆసుపత్రులకు ఖర్చుచేసుకొని ఇబ్బందిపడుతున్న వారికి సీఎంరిలీఫ్‌ ఫండ్‌ ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:56 PM