నిరంతం శ్రమించినా నిరాశే..!
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:21 PM
అక్టోబరు 16న కర్నూలులో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు శ్రమించిన కాంట్రాక్టర్లకు నిరాశే మిగిలింది.
పనులు చేసినా అందని బిల్లులు
మోదీ సభ కోసం అహర్నిశలు కష్టపడ్డ కాంట్రాక్టర్లు
ఎస్టిమేషన్లు పంపడంలో విద్యుత అధికారుల నిర్లక్ష్యం
కల్లూరు, నవంబరు 21 (ఆంద్రజ్యోతి): అక్టోబరు 16న కర్నూలులో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేందుకు శ్రమించిన కాంట్రాక్టర్లకు నిరాశే మిగిలింది. అక్టోబరు 6న విద్యుతశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలందుకున్న కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరుకు చెందిన కాంట్రాక్టర్లు 7వ తేదీ నుంచి నిద్రాహరాలు లేకుండా లేబర్‌ను సమీకరించుకుని నిర్ధేశించిన పనులను సకాలం లో పూర్తిచేశారు. ప్రధాని సభ కావడంతో ప్రాధాన్యత క్రమంలో అక్కడ 12 పార్కింగ్ స్థలాల్లో కాంట్రాక్టర్లు పోల్స్, విద్యుతలైన్లు, విద్యుద్దీకరణ పనులు చేశారు. కాంట్రాక్టర్ ద్వారా వెయ్యికి పైగా విద్యుత స్తంభాలు, 17 జనరేటర్లు, అలాగే 31 కిలోమీటర్ల కండక్టర్, అలాగే 24-160 కెవీ, 4-315 కెవీ, 4-100 కెవీ ట్రాన్సఫార్మర్లు, 41కిలోమీటర్ల కేబుల్‌తో పాటు సంబందిత ఐరన మెటీరియల్ స్టోర్స్ నుంచి అధికారులు డ్రా చేశామని తెలిపారు. పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. అడ్వాన్సు కూడా ఇవ్వలేదని జేసీబీలు, లేబర్‌కు ఇవ్వాల్సిన బిల్లులు ఆల స్యం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదని నిరాశతో బిల్లులు కోసం ఎదురు చూపులు తప్పడం లేదంటున్నారు.
ఎస్టిమేషన వేయడంలో నిర్లక్ష్యం
ప్రధాని సభకు విద్యుత శాఖ తరుపున చేసిన పనులకు ఎస్టిమేషన్లు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడంలో కర్నూలు డివిజన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 12 పార్కింగ్ ఏరియాల్లో పనులు చేసేందుకు 12 మంది అధికారుల ద్వారా కాంట్రాక్టర్లతో పని చేయించారని వాటిని స్కెచ రూపం లో డివిజన అధికారులకు అప్పుడే అందించారని వివరించారు. పర్సంటేజీల కోసమే అధికారులు అక్టోబరు 24వ తేదీ వరకు ఎస్టిమేషన్లు డిస్కంకు పంపలేదని విమర్శించారు. అదికాకుండా సభ పూర్తైన అనంతరం విద్యుతశాఖ అధికారులు మెటీరియల్ నుంచి డిస్‌మ్యాండిల్ (తొలగించి) చేసి స్టోర్స్ తరలించాలి. అక్ర మంలో 30శాతం మెటీరియల్ పాడైపోయిందని ఎస్టిమేషన అధికారులు పంపి నట్లు తెలిసింది. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ వారం రోజుల్లో 30శాతం విద్యుత మె టీరియల్ ఎలా పాడవుతుందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఎస్టిమేషన మార్చేలా వెనక్కి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. నవంబరు నెల పూర్తవుతున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఎస్టిమేషన్లు సీఎండీకి పంపాం
బిల్లుల మంజూరు అంశంపై కర్నూలు టౌన డివిజన ఈఈ శేషాద్రి, రూరల్స్ ఏడీఈ సుబ్బన్నను సంప్రదించగా ప్రధాని సభ పనుల బిల్లులు ఎస్టిమేషన్స తయారు చేసి అక్టోబరు 22న సీఎండీ అనుమతి కోసం పంపామని వివరించారు. పీఎం సభకు డ్రా చేసిన మెటీరియల్ అంతా రిటన చేశామని స్పష్టంచేశారు. 12 పార్కింగ్ ఏరియాల్లో పనిచేసిన వర్క్ ఆర్డర్స్ ఎస్టిమేషన రూ.1.76 కోట్ల బిల్లు మంజూరు కోసం పంపామన్నారు. సీఎండీ ఎస్టిమేషన డెవల్యూషన చెక్ కోసం రిజాయిండర్ పంపగా అభ్యంతరాలు పరిశీలించి మరలా ఉన్నతాధికారులకు పంపామన్నారు. త్వరలో బిల్లులు మంజూరవుతా యన్నారు. మెటీరియల్ డిస్‌మాండిల్ చేసే క్రమంలో 1 లేదా 2 పర్సెంట్ పాడ యినట్లు ఏడీఈ తెలిపారు. మోదీ సభకు ఉపయోగించిన 16జనరేటర్లకు అడ్వాన్స కింద రూ.14.90 లక్షలు చెల్లించినట్లు ఆయన సూచించారు.
కొంత మెటీరియల్ రిటన చేయాల్సి ఉంది
జిల్లా స్టోర్స్ సెంటర్ నుంచి అధికారులు డ్రా చేసుకున్న విద్యుత సామగ్రి కొంత రిటన చేయాల్సి ఉందని స్టోర్స్ ఏడీఈ గురుదివాకర్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై స్టోర్స్ ఏడీఈని సంప్రదించగా కనడక్లర్-31 కిమీ డ్రా చేయగా, 11 కీమీ వెనక్కి ఇచ్చారని, ట్రాన్సఫార్మర్లు 160 కెవీ -24 డ్రాచేసి 20 మాత్రమే రిటన చేశారని 4 ట్రాన్సఫార్మర్లు పెండింగ్ ఉన్నాయన్నారు. 315 కెవీ-4, 100 కెవీ-4 తీసుకుని వాటిని రిటన చేశారన్నారు. కేబుల్ 41కిలోమీటరు డ్రా చేసుకుని ఐరన మెటీరియల్ కొన్ని ఇవ్వాల్సి ఉందన్నారు.
మొదట అలా...తర్వాత ఇలా:
కర్నూలు రూరల్స్ ఏడీఈ సుబ్బన్న మొదట మోదీ సభకు తీసుకున్న మెటీరియల్ అంతా రిటన చేశామని తెలిపారు. స్టోర్స్ ఏడీఈతో సమాచారం తీసుకున్న తర్వాత నాలుగు ట్రాన్సఫార్మర్లు రాగమయూరి వెంచర్‌లో రెగ్యులరైజ్ చేయాల్సి ఉందని, అవి పెండింగ్ ఉన్నాయని తెలుపడం గమనార్హం. నవంబరు 5న వాటికోసం ఎస్టిమేషన తయారుచేసి ఎస్‌ఈ అనుమతి కోసం ఫైల్ పం పామన్నారు. ఎస్టిమేషన మంజూరు కాగానే అక్కడ 160 కేవీ ట్రాన్సఫార్మర్లు రెగ్యులరైజ్ చేసి, 100 కేవీ ట్రాన్సఫార్మర్లు స్టోర్స్‌లో అందజేస్తామని ఓర్వకల్లు ఏఈ సునీల్‌కుమార్ తెలిపారు.