Investments: యూరప్ పరిశ్రమల చూపు భారత్ వైపు
ABN , Publish Date - Nov 15 , 2025 | 06:50 AM
యూరోపియన్ యూనియన్ పరిశ్రమలు తమ పెట్టుబడులకు భద్రత కల్పించే ప్రాంతంగా భారతదేశాన్ని గుర్తించాయని, ఈ అవకాశాన్ని ఏపీ వంటి రాష్ట్రాలు...
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): యూరోపియన్ యూనియన్ పరిశ్రమలు తమ పెట్టుబడులకు భద్రత కల్పించే ప్రాంతంగా భారతదేశాన్ని గుర్తించాయని, ఈ అవకాశాన్ని ఏపీ వంటి రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలని ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామిక సంఘం ఆమ్‌ఫోరి దక్షిణాసియా డైరెక్టర్ నటాషా మజుందార్ అన్నారు. సీఐఐ సదస్సులో ‘వృద్ధికి ముఖద్వారం.. వాణిజ్యం.. ఆవిష్కరణల గమ్యం’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన ప్లీనరీ సెషన్-6లో ఆమె మాట్లాడారు. భారత్, యూరోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే దశలో ఉందన్నారు. ఆ తర్వాత భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యూరప్ పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.