విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:07 PM
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నవంబర్ 1 నుంచీ 7 వరకు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ‘కర్నూలు ఉత్సవ్-2025’ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు కల్చరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నవంబర్ 1 నుంచీ 7 వరకు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ‘కర్నూలు ఉత్సవ్-2025’ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ నాటక అకాడమీ, టీజీవీ కళాక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవ్‌లో ఉన్నత పాఠశాలల వారిని జూనియర్స్‌గా, కళాశాల వారిని సీనియర్స్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. ‘ఉమ్మడి కర్నూలు జిల్లా వైభవం’ అనే అంశంపై ఈ పోటీలు ఉంటాయని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటూ కన్సొలేషన బహుమతులు అందిస్తామని వివరించారు. ఈ పోటీలు ఈనెల 31న ఉదయం 10.30 గం టలకు టీజీవీ కళాక్షేత్రంలో ఉంటాయని, ఒక్కో విద్యాసంస్థ నుంచి 5గురి పేర్లను 99892 65632కు ఈనెల 27 తేదీలోగా పంపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కళాక్షేత్రం ప్రతినిధులు పీపీ గురుమూర్తి, చంద్రకంటి మద్దయ్య, డి. ఈశ్వరయ్య కన్వీనర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.