Health Department: పరిపాలన సౌలభ్యం కోసమే ఆ బదిలీలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:45 AM
ఈఎస్‌ఐలో బదిలీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టామని ఈఎ్‌సఐ డైరెక్టర్ వి.ఆంజనేయులు తెలిపారు. ‘పలుకుబడికే పదోన్నోతి’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు.
స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ పోస్టింగ్స్‌ను పరిశీలిస్తున్నాం
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఈఎస్ఐ డైరెక్టర్ వివరణ
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ఈఎస్‌ఐలో బదిలీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే చేపట్టామని ఈఎ్‌సఐ డైరెక్టర్ వి.ఆంజనేయులు తెలిపారు. ‘పలుకుబడికే పదోన్నోతి’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈఎ్‌సఐ విభాగంలో మూడు జాయింట్ డైరెక్టర్ పోస్టులు, మూడు సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (సీఎ్‌సఆర్‌ఎంవో) పోస్టులున్నాయని తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న ఇద్దరు సీఎ్‌సఆర్‌ఎంవోలు ఐదేళ్ల సేవా కాలాన్ని పూర్తి చేయలేదని, పైగా వారు జేడీ పోస్టులను స్వీకరించడానికి ఆసక్తి చూపలేదని చెప్పారు. విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో సీఎస్ఆర్‌ఎంవో పోస్టు ఖాళీగా ఉందన్నారు. కాగా, ఈఎ్‌సఐలో కడప జాయింట్ డైరెక్టర్, విజయవాడ ఈఎస్‌ఐఐ ఆస్పత్రిలో సీఎస్ఆర్‌ఎంవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సీనియర్ వైద్యులు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నారు. కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్న సీనియర్ వైద్యుడిని కడప బదిలీ చేయాలి. రెండో స్థానంలో ఉన్న వారిని విజయవాడ సీఎ్‌సఆర్‌ఎంవోగా లేదా విజయవాడ జేడీగా బదిలీ చేయాలి. కానీ అధికారులు ఎనికేపాడు ఈఎ్‌సఐ ప్రధాన కార్యాలయంలో ఉన్న జేడీని ఎనికేపాడు జాయింట్ డైరెక్టర్ పోస్టుకు, ఇక్కడ జేడీని ఎనికేపాడులోని ఈఎ్‌సఐ కార్యాలయానికి బదిలీ చేసేశారు. బదిలీల్లో ఐదేళ్లు సర్వీసు నిబంధనలు ఎక్కడ పాటించారో ప్రభుత్వమే తేల్చాలి!. పైగా పరిపాలన సౌలభ్యం కోసమేనంటూ అధికారులు కప్పదాట్లు పడుతుండడం గమనార్హం. ఇక, ఇటీవల పదోన్నతి పొందిన స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్లు మెడికల్ సూపరింటెండెంట్‌కు పోస్టు నియామకం కోరుతూ సమర్పించిన ప్రతిపాదనను ప్రస్తుత ప్రభుత్వ నియమ, నిబంధనలు, వారి సర్వీసు, పెండింగ్ విచారణల ఆధారంగా పరిశీలిస్తామని డైరెక్టర్ బదులిచ్చారు.