Social Media Controversy: దాబాలో భాస్కర్‌రెడ్డికి రాచమర్యాదలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:26 AM
లండన్‌లో ఉంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై...
నలుగురు కానిస్టేబుళ్లపై వేటు.. ఏఎస్సైపై చర్యలకు సిఫార్సు
విజయవాడ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): లండన్‌లో ఉంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టిన వైసీపీ నేత మాలెంపాటి భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్ పోలీసులు రాచమర్యాదలు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను జైలుకు తీసుకెళ్లే క్రమంలో ఓ హోటల్‌లో భోజనాలు పెట్టించారు. ఈ ఫొటోలు అధికారులకు చేరడంతో చర్యలు తీసుకున్నారు. నలుగురు పోలీసు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఎ్‌సఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకునే అంశాన్ని ఏలూరు రేంజ్ ఐజీకి ప్రతిపాదించారు.