Share News

Visakhapatnam: ఉత్సాహంగా నేవీ మారథాన్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 05:08 AM

విశాఖ సాగర తీరంలో పదో ఎడిషన్‌ నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం....

Visakhapatnam: ఉత్సాహంగా నేవీ మారథాన్‌

  • విశాఖలో 17 వేల మందితో నిర్వహణ

విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విశాఖ సాగర తీరంలో పదో ఎడిషన్‌ నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. నేవీ డే వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ను నిర్వహించారు. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి, వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా, విశాఖ కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంఽధిర ప్రసాద్‌, విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, నేవీ విభాగాల ఉద్యోగులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్‌కే బీచ్‌ కాళికామాత ఆలయం వద్ద ప్రారంభమైన ఈ మారథాన్‌లో 42కె, 21కె, 10కె, 5కె విభాగాల్లో దాదాపు 17 వేల మంది పాల్గొన్నారు. 17 దేశాల నుంచి ఔత్సాహికులు ఈ మారథాన్‌లో పాల్గొన్నారని, విశాఖ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరిందని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 05:09 AM