Share News

ప్రకృతి అందాలు కనువిందు

ABN , Publish Date - Nov 17 , 2025 | 11:28 PM

మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో సోమవారం కూడా సందడి నెలకొంది. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌, అంజోడా పైనరీ పార్కులో పర్యాటకులు ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు.

ప్రకృతి అందాలు కనువిందు
సాగర గ్రామంలో సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌

వెలుగులోకి వచ్చిన మరో సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌

అరకులోయకు 12 కిలోమీటర్ల దూరంలో సాగర గ్రామం సమీపంలో మేఘాల కొండ

అరకులోయ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో సోమవారం కూడా సందడి నెలకొంది. మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌, అంజోడా పైనరీ పార్కులో పర్యాటకులు ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేశారు. కాగా మండలంలో మరో సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వెలుగులోకి వచ్చింది.

సాగర గ్రామంలో సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌

డుంబ్రిగుడ మండలం అరకులోయకు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న సాగర గ్రామ సమీపంలో మరో సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వెలుగులోకి వచ్చింది. అరకులోయ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే వంజంగి, మాడగడ మంచు అందాలకు దీటుగా ఇక్కడ ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇది కూడా పర్యాటకుల ఆదరణ పొందుతుందనడంలో సందేహం లేదు.

Updated Date - Nov 17 , 2025 | 11:28 PM