Engineering Student: నోటికి ప్లాస్టర్.. ముక్కుకు క్లిప్పు
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:58 AM
గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటానన్న విషయం ముందుగా స్వగ్రామంలో తల్లిదండ్రులకు తెలియగా...
ఇంజనీరింగ్ విద్యార్థిని బలవన్మరణం.. గుంటూరులోని ప్రైవేటు హాస్టల్‌లో ఘటన
గుంటూరు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకుంటానన్న విషయం ముందుగా స్వగ్రామంలో తల్లిదండ్రులకు తెలియగా, వారు కూతురిని కాపాడుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన త ర్వాత నోటికి టేపు, ముక్కకు క్లిప్పు పెట్టుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. పట్టాభిపురం పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా దెందులూరుకి చెందిన కమ్మ రాజు, రాధిక దంపతు ల కుమార్తె శ్రావ్య(20) నంబూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. గుంటూరు అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో శ్రావ్య విజయవాడలో ఉన్న తన ేస్నహితురాలు జాగృతికి ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పిం ది. దీంతో కంగుతిన్న జాగృతి.. శ్రావ్య అన్నయ్య కు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. విషయం చెప్పింది. వెంటనే వారు శ్రావ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, మనసు బాగోలేక అలా అన్నానని, ఆత్మహత్య చేసుకోనని చెప్పింది. అయినప్పటికీ తల్లిదండ్రులు.. వెంటనే శ్రావ్య ఉంటున్న హాస్టల్ గదిలో ని తోటి విద్యార్థినులకు ఫోన్ చేశారు. జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. అయితే రాత్రి సమయంలో శ్రావ్య గది బయట కుర్చీ వేసుకొని కూర్చుని ఉంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇన్‌స్టా మార్ట్ లో టేపు, క్లిప్స్ ఆర్డర్ పెట్టింది. పది నిమిషాల్లో డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చి వెళ్లాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో బయట వరండాలోనే శ్రావ్య నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్పు పెట్టుకొని చలనంలేకుండా పడిపోయి కనిపించింది. శ్రావ్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. పట్టాభిపురం సీఐ ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు శ్రావ్య మృతదేహాన్ని అప్పగించారు.