Student Attacks Professor with Knife: పరీక్షకు అనుమతించలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:10 AM
పరీక్షకు అనుమతించలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎంటెక్ విద్యార్థి.. ప్రొఫెసర్‌పైనే కత్తితో దాడికి దిగి..
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ విద్యార్థి ఘాతుకం
నూజివీడు టౌన్, అమరావతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పరీక్షకు అనుమతించలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ ఎంటెక్ విద్యార్థి.. ప్రొఫెసర్‌పైనే కత్తితో దాడికి దిగి తీవ్రంగా గాయపరిచాడు. విజయనగరం జిల్లా కొత్తవలస మండ లం వడ్డిగూడెంకు చెందిన మద్ది వినయ్ పురుషోత్తమ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ చదువుతున్నాడు. అయితే, 74 శాతం హాజరు లేకపోవడంతో సోమ వారం వినయ్‌ను పరీక్షలకు అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన వినయ్.. కత్తితో ప్రొఫెసర్ గోపాలరాజుపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన గోపాలరాజును ఆస్పత్రికి తరలించారు. పోలీసులు... హత్యాయత్నం కేసు నమోదు చేసి వినయ్‌ను అరెస్టు చేశారు. కాగా, ప్రొఫెసర్ గోపాలరాజుపై ఎంటెక్ విద్యార్థి దాడికి పాల్పడటాన్ని మంత్రి లోకేశ్ సోమవారం తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ లేమి, హింసా ప్రవృత్తిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోని పేర్కొన్నారు.