దేవాదాయ శాఖ భూముల వేలాలు పూర్తి
ABN , Publish Date - May 12 , 2025 | 11:34 PM
పాణ్యం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని భూముల వేలాలు సోమవారం నిర్వహించారు. ఈ వేలాలు దేవాదాయ శాఖ ఈఓ సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
పాణ్యం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : పాణ్యం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని భూముల వేలాలు సోమవారం నిర్వహించారు. ఈ వేలాలు దేవాదాయ శాఖ ఈఓ సువర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామస్వామి ఆలయానికి చెందిన 29. 96 ఎకరాలకు రూ. 2. 57 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. వీరనారాయణస్వామి ఆలయానికి చెందిన 28. 27 ఎకరాలకు రూ. 2. 89 లక్షలు, పాణికేశ్వరస్వామి ఆలయానికి చెందిన 41. 52 ఎకరాలకు 1. 86 లక్షలు, పడవెంకటాద్రి ఆలయానికి చెందిన 9. 19 ఎకరాలకు రూ. 1. 22 లక్షలు సత్యనారాయణస్వామి ఆలయానికి చెందిన 1. 52 ఎకరాలకు వేలాలు నిర్వహించగా 1. 86, 500ల ఆదాయం చేకూరినట్లు తెలిపారు. వేలాలలో 51 మంది పాల్గొన్నట్లు తెలిపారు. గత వేలాల కంటే ఈ ఏడాది రూ. 2.92 లక్షల ఆదాయం పెరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఈవో గోపి, ఆలయసిబ్బంది పాల్గొన్నారు.