పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించండి: పీడీ
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:00 AM
మండల రైతులు పండ్ల తోటలు సాగు చేసేందుకు ప్రోత్సహించాలని జిల్లా నీటి యాజమా న్య సంస్థ పీడీ సూర్యనారాయణరావు కోరారు.
సంజామల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మండల రైతులు పండ్ల తోటలు సాగు చేసేందుకు ప్రోత్సహించాలని జిల్లా నీటి యాజమా న్య సంస్థ పీడీ సూర్యనారాయణరావు కోరారు. శుక్రవారం ఎనఆర్ ఈజీఎస్ ఏపీవో జయంతితో కలిసి మండలంలోని ముదిగేడు, ఆకు మళ్ల గ్రామాల్లో పర్యటించారు. ముదిగేడులో ఉపాధి పనులు పరిశీ లించారు. ఆకుమళ్ల గ్రామంలో ఖాజాహుసేన అనే రైతు పండ్ల తోటలను పరిశీలించారు. వరి పంట సాగు చేసే వచ్చే ఆదాయానికి రెట్టింపు ఆదాయం పండ్ల తోటల సాగులో ఉంటుంద న్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ ఓబులేసు, అక్బర్ వలి, రైతులు పాల్గొన్నారు.