Share News

‘ఉపాధి’లక్ష్యాలను అధిగమించాలి

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:22 AM

ఉపాధి లక్ష్యాలను అధిగమించాలని డ్వామా పీడీ సూర్యనారాయణ సూచించారు.

 ‘ఉపాధి’లక్ష్యాలను అధిగమించాలి

పాణ్యం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉపాధి లక్ష్యాలను అధిగమించాలని డ్వామా పీడీ సూర్యనారాయణ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. 2025-26 సంవత్సరా నికి లేబర్‌ బడ్జెట్‌ రూ. 2.84 లక్షలకు 65 శాతం మాత్రమే లక్ష్యం సాధించారన్నారు. పండ్ల తోటల కు సంబంధించి 110 ఎకరాలకు 82 ఎకరాలు మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. హౌసింగ్‌ 90 రోజుల మ్యాండేట్‌కు సంబంధించి లబ్ధిదారులకు స్టేజీల వారిగా పేమెంట్లు ఇవ్వాలని, మండలంలో 2014 కంపోస్టు గుంతలు తీయాల్సిఉండగా 296 మాత్రమే అనుమతులు తీసుకున్నారన్నారు. వంద రోజులు పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఏపీవో శేషన్న, ఈసీ శివారెడ్డి, టీఏలు ప్ర సాద్‌, శ్రీనివాసరెడ్డి, ఉమా మహేశ్వరి, కంప్యూటర్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

పనుల పరిశీలన

మిడుతూరు: మండ ల పరిధిలోని తలముడిపి, రోళ్లపాడు గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప థకం కింద చేపట్టిన పను లను శుక్రవారం ప్రాజెక్టు డైరెక్టర్‌ సూర్య నారాయణ పరిశీలించారు. గ్రామా ల్లో ఉపాధి పనులను వేగవంతం చేసి, రైతులకు పండ్ల తోటల పెంపకం పంట్ల అవగాహన కల్పించాలన్నారు. మండలానికి ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయాలని ఉపాధి సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో దశరథరామయ్య, ఏపీవో నాగమ్మ, ఈసీ షబానా, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 12:22 AM