Forest Department: ఏనుగు దాడిలో గుంటూరు జిల్లా వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:45 AM
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
చెన్నై, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెన్స్‌టాక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో వంటమాస్టర్‌గా పని చేస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన పేర్లి సుగంధరావు (36) శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన గది నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఏనుగు.. అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఊటీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.