Nara Lokesh: నాయుడుపేటలో 765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ
ABN , Publish Date - Oct 29 , 2025 | 03:40 AM
ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి మరో ప్రఖ్యాత పరిశ్రమ రాబోతోంది.ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం(ఈసీఎంస్) కింద...
కేంద్రం అనుమతి.. కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రానికి మరో ప్రఖ్యాత పరిశ్రమ రాబోతోంది.ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం(ఈసీఎంస్) కింద రూ. 765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు(పీసీబీ) తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సైర్మా స్ర్టాటెజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌కు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ అనుమతి తెలిపింది. ఈ సంస్థ ద్వారా 955 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈసీఎంస్ కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో రూ. 5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ ఆమోదముద్ర వేసింది. ఈసీఎంస్ కింద సైర్మాకు మూలధన మద్దతును అందించాలని నిర్ణయించినందుకు కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.