విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:09 AM
ఏపీ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీతో విద్యుత్ సంస్థల యాజమాన్యం బుధవారం చర్చలు నిర్వహించింది.
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీతో విద్యుత్ సంస్థల యాజమాన్యం బుధవారం చర్చలు నిర్వహించింది. ట్రాన్స్‌కో ఎస్‌ఎల్‌డీ భవనంలో జరిగిన ఈ చర్చల్లో విద్యుత్ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ చైర్మన్ నాగలక్ష్మి, సభ్యులు పృథ్వీతేజ్, సంతోషరావు తదితర డైరెక్టర్లు పాల్గొన్నారు. 29 ప్రధాన డిమాండ్లపై చర్చించారు. చర్చల అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చర్చలు ఫలించలేదని, సమ్మె తప్ప మరో మార్గం లేదని చెప్పారు. చర్చల్లో జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య, కన్వీనర్ రాఘవరెడ్డి, కో-చైర్మన్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.