Energy Secretary Vijayanand: విద్యుత్తు ఉద్యోగుల చర్చలు సఫలం
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:18 AM
విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొన్ని రోజులుగా తమ సమస్యలపై ఆందోళనబాట పట్టిన జేఏసీతో...
జేఏసీ నేతలతో సీఎస్ చర్చలు
కాంట్రాక్టు సిబ్బంది అంశం పక్కన పెట్టండి
పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దు
విజయానంద్ వినతి.. అంగీకరించిన నేతలు
సమ్మె ప్రతిపాదన విరమణ
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొన్ని రోజులుగా తమ సమస్యలపై ఆందోళనబాట పట్టిన జేఏసీతో యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపింది. శుక్రవారం ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్ నేరుగా జేఏసీ నాయకులతో చర్చించారు. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంట్రాక్టు ఉద్యోగుల విషయం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ విషయంలో తొలుత పట్టుగా ఉన్న జేఏసీ ఓ దశలో నిరసనకు కూడా దిగింది. మరోసారి చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం... సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరడంతో జేఏసీ నాయకులు సానుకూలంగా స్పందించారు. దీంతో 23 సంఘాల్లో 18 సంఘాలు చర్చలు సఫలమైనట్లు ప్రకటించాయి. సమ్మె విరమణకు అంగీకరించాయి.