Share News

27, 28, 29 తేదీల్లో విద్యుత్తు ఉద్యోగులసెలవులు రద్దు: గొట్టిపాటి

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:33 AM

మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్తు ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.

27, 28, 29 తేదీల్లో విద్యుత్తు ఉద్యోగులసెలవులు రద్దు: గొట్టిపాటి

ఇంటర్నెట్ డెస్క్: మొంథా తుఫాను నేపథ్యంలో విద్యుత్తు ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తోపాటు మూడు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. విద్యుత్తు సరఫరాలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్తు సమస్యలు తలెత్తితే వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విద్యుత్తు ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడైనా విద్యుత్తు సమస్యలు తలెత్తితే ప్రజలు 1912 నంబరుకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. కిందపడిన విద్యుత్తు స్తంభాలు, వైర్ల కిందపడిపోతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గొట్టిపాటి సూచించారు.

Updated Date - Oct 27 , 2025 | 04:34 AM