YS Sharmila: ప్రజాస్వామ్యానికి కాపు కాయకుండా మోదీకి ఈసీ వత్తాసు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:29 AM
ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే మా నేత రాహుల్ గాంధీ చెబుతున్న వాస్తవాలపై స్పందించకుండా మౌనం దాల్చుతున్నారు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
బీజేపీ చేతిలో కీలుబొమ్మలా ఎన్నికల సంఘం: షర్మిల
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘ప్రధాని మోదీ ఓట్ల దొంగ కాబట్టే మా నేత రాహుల్ గాంధీ చెబుతున్న వాస్తవాలపై స్పందించకుండా మౌనం దాల్చుతున్నారు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ‘భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేతిలో కీలుబొమ్మలా ఎన్నికల కమిషన్ మారింది. దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ప్రజాస్వామ్యానికి కాపుకాయాల్సిన ఎన్నికల కమిషన్... మోదీకి వత్తాసు పలుకుతోంది. దొడ్డిదారిలో గెలుపు కోసం బీజేపీ, ఎన్నికల కమిషన్‌ను కలుషితం చేసింది. స్వతంత్ర వ్యవస్థలన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయి. ఆర్‌ఎ్‌సఎ్‌సలాంటి అనుబంధ సంస్థల జాబితాలో ఈసీ కూడా భాగమైంది’ అని షర్మిల అన్నారు.