Egg Price Hike: కోడిగుడ్డు కొత్త రికార్డు..
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:29 AM
కోడి గుడ్డు ధర రికార్డు స్థాయిలో మరింత పెరిగింది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, పశ్చిమగోదావరి జిల్లా...
అనపర్తి, తణుకులో హోల్‌సేల్ ధర 7.15
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కోడి గుడ్డు ధర రికార్డు స్థాయిలో మరింత పెరిగింది. సోమవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో హోల్‌సేల్‌గా ఒక గుడ్డు ధరను అత్యధికంగా రూ.7.15గా నిర్ణయించారు. అదే విశాఖ మార్కెట్‌లో రూ.7.02, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రూ.7.06గా నిర్ణయించారు. రాష్ట్రంలో మిగిలిన మార్కెట్లు చూస్తే.. ధర విజయవాడలో రూ.6.90, చిత్తూరులో రూ.6.93కి చేరింది. ఇది పౌల్ర్టీ పరిశ్రమలో సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. ఆదివారం విశాఖలో రిటైల్‌గా ఒక గుడ్డును రూ.ఏడున్నర నుంచి రూ.8 వరకు విక్రయించారు.