ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:44 PM
ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
ఎంపీ బైరెడ్డి శబరి
పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరణ
నంద్యాల రూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం పట్టణ బొమ్మలసత్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కొన్ని సమస్యలను దశల వారీగా పరిష్కారం చూపుతామని బాధితులకు హామీ ఇచ్చారు. నంద్యాల పదవీవిరమణ ఉద్యోగులకు ఎంపీ నిఽధుల ద్వారా సహకరిస్తామన్నారు. రైల్వే, నేషనల్ హైవే వద్దనున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆమె ఆదేశించారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన డైరెక్టర్ విశ్వనాథ్‌రెడ్డి, నందికొట్కూరు మున్సిపల్ చైర్మన సుధాకర్‌రెడ్డి , రైల్వే జోనల్ యూజర్స్ కన్సల్టేట్ కమిటీ మెం బరు వెంకటరంగయ్య, బీఎ్‌సఎనఎల్ సలహా కమిటీ సభ్యులు విజయకుమార్ పాల్గొన్నారు.
బాధితులకు అండగా సీఎంఆర్‌ఎఫ్
అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండ అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం బొమ్మలసత్రంలోని పార్టీ కార్యాలయంలో ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామానికి చెందిన సజ్జల నాగశేషుకు మంజూరైన రూ 8.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎంపీ అందజేశారు.
ఎస్పీని కలిసిన ఎంపీ
నంద్యాల టౌన : ఎస్పీ సునీల్ షెరానను ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలి శారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యా లయంలో ఎస్పీకి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ అనంతరం జిల్లాలోని శాంతి భద్రతలపై, మోదీ పర్యటన పై చర్చించారు. జిల్లాలోని పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంట నాయకులు పాల్గొన్నారు.