పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి
ABN , Publish Date - May 11 , 2025 | 12:14 AM
కల్లూరు అర్బన పరిధిలోని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
కల్లూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన పరిధిలోని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి స్పష్టం చేశారు. శనివారం 19వ వార్డు రెవెన్యూ నాగిరెడ్డి కాలనీలోని మున్సిపల్ పార్కును సందర్శించి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. 19వ వార్డులోని పలు కాలనీలో సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పార్కులు అన్యాక్రాంతానికి గురి కాకుండా మున్సిపల్ అధికారులతో చర్చించి ప్రజలందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ మేరకు ప్రజలు పార్కులో తలెత్తిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, పల్లె రకఘునాథరెడ్డి మైనార్టీ నాయకులు చాంద్‌బాషా, శ్రీకాంత, జనార్దన రెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.