పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:09 AM
పార్టీ బలోపేతానికి మోర్చా నాయకులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : పార్టీ బలోపేతానికి మోర్చా నాయకులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కిసాన మోర్చా నాయకుడిగా బిజ్జం సుబ్బారెడ్డి, ఓబీసీ మోర్చా నాయకుడిగా శ్రీధర్‌యాదవ్, ఎస్సీ మోర్చా నాయకుడిగా తప్పెట ప్రసాద్, మైనారిటీ మోర్చా నాయకుడిగా సయ్యద్ రజాక్‌ను నియమించారు. వీరికి నియామకపత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీకి మోర్చా నాయకులు పట్టుకొమ్మలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు నరసింహారావు, డాక్టర్ ఆదినారాయణ, నిమ్మకాయల సుధాకర్ పాల్గొన్నారు.