సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:45 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలనికలెక్టర్‌పి.రంజిత బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులకు సూచించారు.
కర్నూలు కలెక్టరేట్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలనికలెక్టర్‌పి.రంజిత బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జాయిం ట్ కలెక్టర్‌పాల్గొని వినతులను స్వీకరించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నా పొలంలో 10 టేకు చెట్లను తొలగించినా విద్యుత రూరల్ ఏఈ, లైనమెన, లైన ఇన్సపెక్టర్ చర్యలు తీసుకోలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతు మాధవరాజు వినతి పత్రం అందజేశారు.
ఫ బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో అక్రమాలు జరిగాయని, బీసీ స్టూడెంట్ ఫెడరేషన వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్‌బాబు, రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన కోనేటి వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. పెద్దపాడు బీసీ బాలుర హాస్టల్ ప్రహరి నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సాయి కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఫనగరంలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడును బదిలీ చేయాలని కోరుతూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఫ కర్నూలు ప్రెస్‌క్లబ్ సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఫగత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన జీవో.నెం.17ను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి మునెప్ప వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అశ్విని సాయి రేణుకా ఎల్లమ్మ కాలనీకి తాగునీటి వసతి కల్పించాలని కాలనీవాసులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఫఎటువంటి అర్హత లేని వారు ప్రైవేటు హాస్పిటల్స్, క్లినిక్స్‌లలో పని చేస్తున్నారని, అలాంటి హాస్పిటల్స్‌పై తనిఖీలు చేపట్టాలని నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ కలెక్టరేట్‌లో డీఎంహెచవోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దివాకర్ పాల్గొన్నారు.
ఫ నగర కార్పొరేషనలో ఉన్న రామప్రియనగర్ నందు అక్రమంగా రిజిస్ర్టేషన్లుపై విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని రామప్రియనగర్ వెల్ఫేర్ అసోసియేషన కలెక్టర్‌ను కోరారు.
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ఫ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జూలై 28(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 22 అర్జీలు వచ్చాయి. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి విభాగానికి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీ్‌షరెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.కే.విశ్వేశ్వరరెడ్డి, ఇంచార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ లీల ప్రసాద్, ఆర్‌వో జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య, శానిటేషన సూపర్‌వైజర్ నాగరాజు పాల్గొన్నారు.
ఫ నగర పాలక పరిధిలోని 43వ వార్డులో ఇందిరాగాంఽధీనగర్ కొట్టం బడి స్థలాన్ని కాపాడాలని స్థానిక కార్పొరేటర్ మునెమ్మ కోరారు. కమిషనర్ పి.విశ్వనాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి.రాముడు, కొట్టంబడి పరిరక్షణ కమిటీ సభ్యులు కే.మల్లికార్జున, ఎస్.రోశయ్య, ఎం.భాస్కర్, లోకేశ ఉన్నారు.
ఫ ముజఫర్ నగర్ కమ్యూనిటీ హలులో నిర్వహిస్తున్న 81,82 సచివాలయాలను తక్షణమే ఖాళీ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి టి.రాముడు డిమాండ్ చేశారు. నగరపాలక కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ.సాయిబాబ, కే.సుధాకరప్ప, నరసింహులు, జి.ఏసు పాల్గొన్నారు.
ఫ లక్ష్మీనగర్ చివరి నాలుగు లైన్లలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం నగర కార్యదర్శివర్గసభ్యుడు ఆర్.నరసింహులు కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్.అజ్మత, సాబీర్, దేవదాసు, బందేనవాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ 10 వ వార్డు చాకలివీధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని నగర పాలక కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహంచారు. సీపీఎం పాబబస్తీ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ చాకలివీధిలో గత ఆరు రోజులుగా తాగునీరు రావడం లేదన్నారు. అనంతరం కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యవర్గసభ్యులు ఎస్‌ఎండి.షరీఫ్, రజక సంఘం నాయకులు గురుశేఖర్, జయమ్మ పాల్గొన్నారు.