ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయాలి
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:10 AM
పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రిం చేందుకు కృషి చేయాలని డోన డీఎస్పీ పి.శ్రీనివాసులు తెలిపారు.
డోన టౌన, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రిం చేందుకు కృషి చేయాలని డోన డీఎస్పీ పి.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రెండు అపాచి ద్విచక్రవాహనానలను పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాతో కలిసి డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని ఆదేశించారు. ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ కింద వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామని, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేయరాద న్నారు. ప్రజలు అవగాహన కల్పించి క్రమపద్ధతిలో వాహనాలు పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ రాకేష్, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, హోంగార్డ్స్ నాగరాజు, సుధాకర్, శివ, తదితరులు పాల్గొన్నారు.