Share News

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Dec 22 , 2025 | 11:54 PM

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్దికి సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అదికారులను ఆదేశించారు.

 జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

ముఖ్యమంత్రి మార్గదర్శకాలపై

అధికారులకు దిశానిర్దేశం

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా అభివృద్దికి సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి అదికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల కాన్పరెన్సలో జిల్లాలను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలన్న దిశగా ముఖ్యమంత్రి మార్గదర్శకాలు జారీ చేశారన్నారు. ఈసమావేశంలో మొత్తం 118 అంశాలపై చర్చించగా 95 అంశాలను సమర్ధవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో 2026 జనవరి 15 నాటికి వందశాతం ఈఆపీస్‌ అమలు చేయాలన్నారు. అలాగే పీపోర్‌ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి మార్గదర్శకులను మ్యాపింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో జేసీ కార్తీ క్‌, డీఆర్వో రాంనాయక్‌ తదితరులు న్నారు.

విద్యార్థులకు పరిశుభ్రత అలవాట్లు పెంపొందించేందుకు ‘ముస్తాబ్‌’

విద్యార్థులలో వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు పెంపొందించేందుకు ప్రభుత్వం ముస్తాబ్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హల్‌లో ముస్తాబ్‌ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో బాగంగా ప్రతి తరగతిగది. వసతి గృహంలో ఒక ముస్తాబ్‌ కార్నర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. అలాగే బాల్య వివాహాలు సమాజానికి శాపమని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌ కారిడార్‌లో బాల్యవివాహాల నిర్మూలనపై వంద రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే చైల్డ్‌హెల్ప్‌లైన 1098, అధికారులకు తెలియజేయాలన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 11:54 PM