Share News

బాధ్యతలు చేపట్టిన ఈఈలు

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:28 PM

జలవనరుల శాఖ పబ్లిక్‌ వర్క్స్‌ (పీడబ్ల్యూ) ఎఫ్‌ఆర్‌ఎల్‌ కర్నూలు డివిజన ఈఈ (ఎఫ్‌ఏసీ)గా బి. విజయరాజు, హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు డివిజన-2 ఈఈ (ఎఫ్‌ఏసీ)గా ఎన. ప్రసాద్‌ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

   బాధ్యతలు చేపట్టిన ఈఈలు
జలవనరుల శాఖ పీడబ్ల్యూ డివిజన ఈఈగా బాధ్యతలు చేపట్టిన విజయరాజును అభినందిస్తున్న ఇంజనీర్లు

కర్నూలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జలవనరుల శాఖ పబ్లిక్‌ వర్క్స్‌ (పీడబ్ల్యూ) ఎఫ్‌ఆర్‌ఎల్‌ కర్నూలు డివిజన ఈఈ (ఎఫ్‌ఏసీ)గా బి. విజయరాజు, హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు డివిజన-2 ఈఈ (ఎఫ్‌ఏసీ)గా ఎన. ప్రసాద్‌ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విజయరాజు 1996లో ఏఈఈగా జలవనరుల శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆళ్లగడ్డ తెలుగుగంగ ప్రాజెక్టు, ఎమ్మిగనూరులో గురురాఘవేంద్ర ప్రాజెక్టులో సుదీర్ఘకాలంగా పని చేశారు. 2014లో డీఈఈగా పదోన్నతిపై కడప జిల్లాకు బదిలీ వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం క్వాలిటీ సెల్‌ సబ్‌ డివిజన డీఈఈగా పని చేస్తున్న ఈయనకు ఎఫ్‌ఆర్‌ఎల్‌ డివిజన ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎన. ప్రసాద్‌ రావు బీటెక్‌ పూర్తి 1986లో ఇరిగేషన శాఖలో ఏఈఈగా ఉద్యోగంలో చేరారు. 2013లో డీఈఈగా పదోన్నతి పొందారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ కాలం పని చేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా బత్తలపల్లి టీబీపీ హెచ్చెల్సీ డీసీ సబ్‌ డివిజన డీఈగా పని చేస్తూనే కేసీ కెనాల్‌ కర్నూలు సబ్‌ డివిజన డీఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు డివిజన-2 ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - Jul 11 , 2025 | 11:28 PM