Srijan Bhattacharya: విద్య ఉన్నత ప్రమాణాలతో ఉండాలి హిందూ భావజాలంతో కాదు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:20 AM
విద్య అనేది హిందూ భావజాలంతో కాకుండా.. ఉన్నత ప్రమాణాలతో ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఎస్‌ఎఫ్ఐ)జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పేర్కొన్నారు.
ఎస్‌ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య
మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది: జస్టిస్ చంద్రు
తిరుపతి (విద్య), డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘విద్య అనేది హిందూ భావజాలంతో కాకుండా.. ఉన్నత ప్రమాణాలతో ఉండాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఎస్‌ఎఫ్ఐ)జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య పేర్కొన్నారు. తిరుపతిలో మూడు రోజులపాటు జరిగే ఎస్‌ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ర్యాలీ అనంతరం ఎస్పీజేఎన్‌ఎం గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందని, ఇది దేశానికి చేటు కలిగిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల ఐక్యత ద్వారా సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేస్తున్నాయని జస్టిస్ కె.చంద్రు ధ్వజమెత్తారు. మోదీ, అమిత్‌షా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచిత విద్యకోసం ఎస్‌ఎఫ్ఐ పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, జాతీయ కార్యదర్శి శిల్ప ప్రసంగించారు.