Minister Savitha: విద్యతోనే కురుబల అభ్యున్నతి
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:49 AM
విద్యతోనే కురుబల అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఆర్‌ఆర్ కన్వెన్షన్ సెంటరులో...
కురుబల ఆత్మీయ సదస్సులో మంత్రి సవిత
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): విద్యతోనే కురుబల అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఆర్‌ఆర్ కన్వెన్షన్ సెంటరులో ఆదివారం జరిగిన కురుబ, కురువ, కురుమ సామాజిక వర్గీయుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశానికి ఆమె హాజరయ్యారు. కురుబ, కురుమ, కురువలు ఐక్యం గా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అమరావతిలో భక్త కనకదాస కాంస్య విగ్రహం, తిరుపతిలో కనకదాస పీఠం ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో కురుబలకు ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కురుబలను గెలిపించుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తిరుపతిలో వచ్చే నెల 5న జరుగనున్న భక్త కనకదాస కాంస్య విగ్రహావిష్కరణకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మంత్రి సవిత ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు.