Share News

విజయానికి విద్యే కీలకం

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:06 AM

విజయానికి విద్యే కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి సీనియర్‌ సెకండరీ స్కూల్‌ స్వర్ణోత్సవాలకు గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విజయానికి విద్యే కీలకం
మాట్లాడుతున్న గౌవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

ఘనంగా మాంటిస్సోరి స్వర్ణోత్సవాలు

కర్నూలు ఎడ్యుకేషన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయానికి విద్యే కీలకమని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలోని ఏ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి సీనియర్‌ సెకండరీ స్కూల్‌ స్వర్ణోత్సవాలకు గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ విగ్రహానికి గవర్నర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనను తిలకించారు. అలాగే గోల్డెన జూబ్లీ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ మాంటిస్సోరి విద్యాసంస్థలను కళ్యాణమ్మ అంకిత భావంతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేశారన్నారు. వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయడంలో మాంటిస్సోరి విద్యాసంస్థలు కృషి చేశాయన్నారు. ఈ విద్యా సంస్థలో చదివినవారు ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐపీఎస్‌, ఐఏఎస్‌లుగా ఎదిగారన్నారు. అయితే జడ్జీలు, గవర్నర్‌లు ఎవరూ కాలేదా? అని ఆయన చమత్కరించారు. అసమానతలను తగ్గించడంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ మాట్లాడతూ మాంటిస్సోరి విద్యాసంస్థలు సమాజంలో ఎంతోమందిని ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు కృషి చేశాయన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మాంటిస్సోరి విద్యాసంస్థలు వేలాది మంది విద్యార్థులకు చదువుతో పాటు జ్ఞానం, మంచి నడవడికను నేర్పుతున్నాయన్నారు. గవర్నర్‌కు పాఠశాలలో ఎనసీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్‌, మాంటిస్సోరి పాఠశాలల చైర్మన రాజశేఖర్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వినూషారెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి.పుల్లయ్య, పీబీవీ సుబ్బయ్య, కేజే రెడ్డి, అపుస్మా జిల్లా అధ్యక్షులు వాసుదేవయ్య, శ్రీనివాసరెడ్డి, నాగరాజు, యుగంధర్‌, అధ్యాపకులు, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:06 AM