emmasani Chandrashekar: ఎకోసిస్టమ్ కోసమే రాయితీలు
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:48 AM
పరిశ్రమల రాకకు అనుగుణంగా ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
పరిశ్రమల రాకకు అది అవసరం
బెంగళూరుతో విశాఖకు పోలిక వద్దు
గూగుల్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాన
న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల రాకకు అనుగుణంగా ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందాలంటే రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గూగుల్ ఏఐ హబ్‌కు భారీగా రాయితీలిచ్చారంటూ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బెంగళూరుతో విశాఖను పోల్చవద్దు. గూగుల్ ఏఐ హబ్‌పై ఒప్పందం తర్వాత విశాఖలో చాలా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి’’ అని తెలిపారు.