అన్నవరం ప్రసాదం..ఆషాఢంలో అదరహో
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:45 AM
అన్నవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి ప్రసాదం అంటే ఆకు కూడా వదలకుండా నాకేస్తారు. అంతటి అమృతమైన స్వామివారి ప్ర సాదం అద్భుతమైన విక్రయాలు ఆషాఢమాసం లో జరుగుతాయి. సహజంగా ఆషాఢం శూన్యమాసం కావడంతో భక్తుల సంఖ్య అతి తక్కువగా ఉంటు ంది. అయితే ఆషాఢమాసంలో సత్యదేవుడి ప్రసాదానికి అధిక డిమాండ్ నెలకుని భారీ ఎత్తున అమ్మకా లుంటాయి. ఒక్క ఆషాఢంలోనే సుమారు రూ.10లక్షల ప్యాకె

ఒక్కనెలలోనే సుమారు
10 లక్షల ప్యాకెట్ల అమ్మకాలు
అదనపు కౌంటర్లు,
సిబ్బందికి ప్రత్యేక విధులు
ఇప్పటికే సమాకూరిన
రూ.50లక్షల ఆదాయం
అన్నవరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సత్యదేవుడి ప్రసాదం అంటే ఆకు కూడా వదలకుండా నాకేస్తారు. అంతటి అమృతమైన స్వామివారి ప్ర సాదం అద్భుతమైన విక్రయాలు ఆషాఢమాసం లో జరుగుతాయి. సహజంగా ఆషాఢం శూన్యమాసం కావడంతో భక్తుల సంఖ్య అతి తక్కువగా ఉంటు ంది. అయితే ఆషాఢమాసంలో సత్యదేవుడి ప్రసాదానికి అధిక డిమాండ్ నెలకుని భారీ ఎత్తున అమ్మకా లుంటాయి. ఒక్క ఆషాఢంలోనే సుమారు రూ.10లక్షల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయని అధికారుల అంచనా. ఆషాఢమాసంలో తలుపులమ్మ లోవ దేవస్థానానికి భక్తులు అధికంగా తరలివెళుతుంటారు. తిరుగు ప్రయాణంలో వారంతా సత్యదేవుడి స్వామివారి ప్రసాదాలను కొనుగోలు చేసుకుని తమ స్వస్థలాలకు వెళ్లి బంధుమిత్రులకు పంచుతుంటారు. ఆషాఢమాసంలో కేవలం ప్రసాదాల విక్రయాల ద్వారా స్వామివారి ఖజానాకు రూ.2 కోట్లమేర ఆదా యం వస్తుంది. ఈ ప్రసాదం విక్రయాలు ఆది వారం, మంగళవారం, గురువారాల్లో మాత్రమే అధికంగా ఉంటాయి. వీటి కోసం దేవస్థానం యంత్రాంగం అన్న వరం జాతీయ రహదారిపై ఉన్న రెండు నమూనాలయాలు, తొలిపావంచా వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తుంటారు. ఆషాఢం వారంలో మూడురోజులు ప్రసాదం తయారుచేసే వంటస్వాములు, ప్యా కింగ్ సిబ్బంది కష్టపడుతుంటూనే ఉంటారు. ప్రసాదం తయారీకేంద్రంలో నిరంతర పర్యవేక్షణతో అమ్మకాల సమయంలో ఎక్కడా లేదు అనకుండా కౌంటర్ సిబ్బందితో సమన్వయం చేసుకుం టూ సిబ్బంది శ్రమిస్తుంటారు. శుచి, రుచితో కూ డిన ప్రసాదం అందించడమే లక్ష్యమని ఈవో సుబ్బారావు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో ఇప్పటివరకు 2 లక్షల 50వేల ప్యాకెట్లు విక్రయాలు జరగగా రూ.50లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు.