Visakhapatnam: విశాఖలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:55 AM
విశాఖపట్నంలో భూకంపం అలజడి రేపింది. నగరంతో పాటు పరిసరాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో భూమి కంపించింది.
విశాఖపట్నం, అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో భూకంపం అలజడి రేపింది. నగరంతో పాటు పరిసరాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో భూమి కంపించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదైంది. భీమిలి ప్రాంతంలో శబ్దాలు కూడా వచ్చినట్టు చెబుతున్నారు. తొట్లకొండ పరిసరాలు భూకంప కేంద్ర స్థానంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోనూ కొద్దిసేపు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. అల్లూరి జిల్లా పాడేరు పరిసరాల్లో తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జి.మాడుగుల మండలం పులుసుమామిడి, జంగాలమెట్ట గ్రామాల్లో పలువురు గిరిజనుల ఇళ్ల గోడలు బీటలు వారాయి.