Vanjangi Hills: వంజంగిపై మంచు దుప్పటి
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:16 AM
సెప్టెంబరు నెల పూర్తి కాలేదు. శీతాకాలం రానేలేదు. అప్పుడే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండలు మంచు దుప్పట్లో దూరిపోయాయి.
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబరు నెల పూర్తి కాలేదు. శీతాకాలం రానేలేదు. అప్పుడే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండలు మంచు దుప్పట్లో దూరిపోయాయి. గురువారం ఉదయమే దట్టమైన మంచు సందర్శకులకు కనువిందు చేసింది. సూర్యోదయానికి ముందే పచ్చని కొండలపై మంచు మేఘాలు ఆవరించిన దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఈ దృశ్యాలను పర్యాటకులు కెమెరాల్లో బంధించారు.
- పాడేరు, ఆంధ్రజ్యోతి