Share News

Intercultural Marriage: పెళ్లి చేసిన చెవినొప్పి..

ABN , Publish Date - Aug 18 , 2025 | 06:43 AM

మెక్సికోలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఆంధ్రా అబ్బాయి...ఒకరోజు అతనికి చెవినొప్పి వచ్చింది...అక్కడే ఓ మహిళా ఈఎన్‌టీ డాక్టర్‌ వద్దకు వైద్యానికి వెళ్లాడు.

Intercultural Marriage: పెళ్లి చేసిన చెవినొప్పి..

  • చికిత్స చేసిన డాక్టర్‌తో ప్రేమ

  • ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి...మెక్సికో అమ్మాయి

మెక్సికోలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఆంధ్రా అబ్బాయి...ఒకరోజు అతనికి చెవినొప్పి వచ్చింది...అక్కడే ఓ మహిళా ఈఎన్‌టీ డాక్టర్‌ వద్దకు వైద్యానికి వెళ్లాడు. చికిత్స తీసుకున్నాడు. వారిద్దరికీ అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా ఓకే చెప్పారు. అంతే...ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ అబ్బాయి ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం శివారు మర్లపాలేనికి చెందిన జాస్తి మురళీ కృష్ణ, సునీత దంపతుల కుమారుడు యశ్వంత్‌. ఆ అమ్మాయి జ్యాన్యజాయ్‌ రూయిజ్‌ అంజర్‌. గన్నవరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి భారత సంప్రదాయం ప్రకారం పురోహితులు వీరిద్దరికీ వివాహం జరిపించారు. అదీ సంగతి!

-గన్నవరం, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 18 , 2025 | 06:44 AM