Share News

Career Achievement: విజ్ఞాన్‌ విద్యార్థికి రూ.50 లక్షల వార్షిక వేతనం

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:36 AM

విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎ్‌సఈ నాలుగో సంవత్సరం చదువుతున్న బలస హర్ష..

Career Achievement: విజ్ఞాన్‌ విద్యార్థికి రూ.50 లక్షల వార్షిక వేతనం

అగనంపూడి (విశాఖపట్నం), మార్చి 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పరిధిలోని దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎ్‌సఈ నాలుగో సంవత్సరం చదువుతున్న బలస హర్ష.. అమెజాన్‌ కంపెనీలో రూ.50 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హర్షను ప్రిన్సిపాల్‌ జె.సుధాకర్‌, రెక్టార్‌ వి.మధుసూదనరావు అభినందించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యార్థులకు తొలి ఏడాది నుంచే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తో పాటు కోడింగ్‌పై శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఎ్‌సఈ విభాగాధిపతి దినేశ్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 05:36 AM