Share News

దసరా ‘డబుల్‌’ డ్యూటీ!

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:23 AM

- వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ సెక్రటరీగా పని చేస్తున్న జస్వంతకు పున్నమి ఘాట్‌ వద్ద దసరా డ్యూటీ వేశారు. ప్రతి రోజూ రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అక్కడే విధులు నిర్వర్తించాలని వీఎంసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో అదే జస్వంతకు అదే సమయంలో(రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు) నాలుగు పిల్లర్ల సెంటర్‌లో విధులు నిర్వర్తించాలని ఆదేశాలిచ్చారు. - మరో సచివాలయంలో పని చేసే వెల్ఫేర్‌ సెక్రటరీ సాయికిషోర్‌కు రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మోడల్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద డ్యూటీ వేశారు. అదే సమయంలో పున్నమి ఘాట్‌ వద్ద డ్యూటీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలా ఒకే ఉద్యోగికి ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో రెండు ప్రాంతాల్లో డ్యూటీలు వేశారు. ఇలా మొత్తంగా 207 మంది ఉద్యోగులకు డబుల్‌ డ్యూటీలు వేశారు. సచివాలయ ఉద్యోగులకు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన(వీఎంసీ) అధికారులు కేటాయించిన దసరా ఉత్సవాల విధుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

దసరా ‘డబుల్‌’ డ్యూటీ!

- ఒక ఉద్యోగికి ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో రెండు ప్రాంతాల్లో డ్యూటీ

- మొత్తం 207 మంది ఉద్యోగులకు ఇదే విధంగా విధుల కేటాయింపు

- ఉత్తర్వులు చూసి నివ్వెరపోతున్న వెల్ఫేర్‌ సెక్రటరీ, మహిళా పోలీసులు

- వీఎంసీ అధికారుల పనితీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

- 50 ఏళ్ల వయసు పైబడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాత్రి విధులు

- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వార్డు సచివాలయాల ఉద్యోగులు

- వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ సెక్రటరీగా పని చేస్తున్న జస్వంతకు పున్నమి ఘాట్‌ వద్ద దసరా డ్యూటీ వేశారు. ప్రతి రోజూ రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అక్కడే విధులు నిర్వర్తించాలని వీఎంసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో అదే జస్వంతకు అదే సమయంలో(రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు) నాలుగు పిల్లర్ల సెంటర్‌లో విధులు నిర్వర్తించాలని ఆదేశాలిచ్చారు.

- మరో సచివాలయంలో పని చేసే వెల్ఫేర్‌ సెక్రటరీ సాయికిషోర్‌కు రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మోడల్‌ గెస్ట్‌ హౌస్‌ వద్ద డ్యూటీ వేశారు. అదే సమయంలో పున్నమి ఘాట్‌ వద్ద డ్యూటీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇలా ఒకే ఉద్యోగికి ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో రెండు ప్రాంతాల్లో డ్యూటీలు వేశారు. ఇలా మొత్తంగా 207 మంది ఉద్యోగులకు డబుల్‌ డ్యూటీలు వేశారు. సచివాలయ ఉద్యోగులకు విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన(వీఎంసీ) అధికారులు కేటాయించిన దసరా ఉత్సవాల విధుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ):

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అవసరమైన వసతులను కల్పించేందుకు అన్నిశాఖల అధికారులకు ప్రభుత్వం విధులు కేటాయిస్తోంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వాహనాల పార్కింగ్‌, వీఐపీ ప్రోటోకాల్‌, కంట్రోల్‌ రూం నిర్వహణ తదితర పనులు చేసేందుకు వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ, మహిళా పోలీసులకు వీఎంసీ అధికారులు కేటాయించిన విధుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీన సామాజిక పింఛన్లను వెల్ఫేర్‌ సెక్రటరీలు పంపిణీ చేయాల్సి ఉందనే విషయాన్ని వీఎంసీ అధికారులు మర్చిపోయి దసరా విధులు కేటాయించడాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు.

డ్రాఫ్ట్‌, ఇంజనీరింగ్‌ సెక్షనలను కలిపేసి.. డబుల్‌ డ్యూటీ!

నిర్ధేశించిన 26 సెక్టార్‌లకు 43 విభాగాల్లో 1,490 మంది పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ కార్మికులకు విధులు కేటాయించారు. వీరిని పర్యవేక్షించే విధులను నగరంలోని 286 సచివాలయాల్లో పని చేసే వెల్ఫేర్‌ సెక్రటరీ, మహిళా పోలీసులకు అప్పగిస్తూ ఈ నెల తొమ్మిదో తేదీన వీఎంసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సెక్టార్‌లో ఎనిమిది గంటల చొప్పున ఒక వ్యక్తికి విధులు కేటాయించి, రోజుకు ముగ్గురికి డ్యూటీ వేశారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిప్ట్‌, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు రెండో షిప్ట్‌, రాత్రి 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్‌ షిప్ట్‌గా నిర్ణయించారు. డ్రాఫ్ట్‌ సెక్షనలోని 26 సెక్టార్‌లలో విధులు కేటాయించిన ఉద్యోగికే, మరలా ఇంజనీరింగ్‌లోని 43 విభాగాల్లో విధులు కేటాయించేశారు. అదీ ఒకే షిప్ట్‌లో కేటాయించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాత్రి విధులు

వయసుపైబడి, ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులకు రాత్రి సమయంలో విధులు కేటాయించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్షసాధింపు దోరణితోనే వీఎంసీ అధికారులు ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారని మండిపడుతున్నారు. సచివాలయంలో పని చేసే యువతకు ఎలాంటి విధులు కేటాయించకుండా 50 ఏళ్లు పైబడి బీపీ, షుగర్‌, కిడ్నీ తదితర వ్యాధులతో బాధపడుతున్న తమనే విధులకు పంపాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. అస్పష్టంగా, అనాలోచితంగా, కక్షసాధింపుతో ఉన్న ఉత్తర్వులను మరోసారి పరిశీలించి, ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:24 AM