Share News

వైసీపీ హయాంలో ..విద్యావ్యవస్థ నాశనం

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:55 PM

వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ సర్వ నాశనమైందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

 వైసీపీ హయాంలో ..విద్యావ్యవస్థ నాశనం
విద్యా సదస్సులో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

ఫ విప్లవాత్మక మార్పులతో

గాడిలో పెడుతున్నాం

ఫ మౌలిక వసతుల కల్పనకు కృషి

ఫ నియోజకవర్గ స్థాయి విద్యా సదస్సులో

మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, జూలై 11 ( ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థ సర్వ నాశనమైందని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శుక్రవారం బనగా నపల్లె ఎంపీడీవో కార్యాలయంలో నియోజ కవర్గ స్థాయి విద్యాసదస్సు డీఈవో జనార్దన రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా హెచఎంలు, ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో ఉన్న సమస్యలను క్లుప్తంగా ఏకరువు పెట్టారు. అనంతరం మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం విజయంలో ఉపాధ్యా యుల పాత్ర మరువలేని దన్నారు. ప్రతి పాఠశాల లో సమస్యలు పరిష్కా రానికి కృషి చేస్తామన్నా రు. సీఎం చంద్రబాబు, విద్యా మంత్రి నారా లోకేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మ క మార్పులు తీసుకు వ చ్చారన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిది ద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వపాఠశాలలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. నాడు-నేడు పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. పనులు పూర్తికాకపోవడంతో వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు తమపై పడ్డాయని విమర్శించారు. అనుభవం లేని జగన పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని విమర్శించారు. నీటి సమస్యపై ఆర్‌డబ్ల్యు ఎస్‌ అధికారులతో పూర్తి వివరా లతో సమగ్ర నివేదిక రూ పొందించి పదిరోజుల్లో నివే దిక సమర్పించాలన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కుటుంబంలో చదు వుతున్న అందరి పిల్లలకు తల్లికి వందనం ఇచ్చి ఇచ్చిన హామీని నెరవేర్చు కున్నామన్నారు. అలాగే కూ టమి ప్రభుత్వంలో నాణ్య మైన భోజనం విద్యార్థులకు వడ్డిస్తున్నా మ న్నారు. మూడు విభాగాలుగా విభజించి పాఠశాల మౌలిక వసతులపై నివేదిక సమ ర్పించాలని మంత్రి విద్యాధికారులను, ఉ పాధ్యాయులను కోరారు. సమావేశంలో పం చాయతీరాజ్‌ డీఈ నాగశ్రీనివాసులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ మధుసూదన, ఏఈ సాయికృష్ణ, మండల విద్యాధికారులు వెంకటసుబ్బయ్య, ఈశ్వర య్య, అవుకు, కొలిమిగుండ్ల, సంజా మల, కోవెలకుంట్ల మండలాలకు చెందిన ఎంఈవో లు, సర్వశిక్ష అభియాన అధికారులు, పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 11:55 PM