Vijayawada: 7న దుర్గ గుడి మూసివేత
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:34 AM
చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విజయవాడలోని
విజయవాడ(ఇంద్రకీలాద్రి), ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు దేవస్ధానం ఈవో వి.కె.శీనానాయక్ తెలిపారు. ఆ రోజు 3.30 గంటలకు కవాట బంధనం చేయనున్నట్టు వైదిక కమిటీ తెలిపిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు.