భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ నిమజ్జనోత్సవం
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:49 PM
పట్టణంలో గత తొమ్మిదిరోజులుగా పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవారిని 11వ రోజు శుక్రవారం చెరువుకట్ట దగ్గర వినాయక ఘట్‌లో నిమిజ్జనం చేశారు.
నంద్యాల కల్చరల్, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గత తొమ్మిదిరోజులుగా పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవారిని 11వ రోజు శుక్రవారం చెరువుకట్ట దగ్గర వినాయక ఘట్‌లో నిమిజ్జనం చేశారు.మద్దిలేటిస్వామి ఆలయంలో మధుసూదనరాయల్, ఉప్పరిపేటలో, గిరినాధ్ సెంటర్‌లో ప్రతిష్టించిన అమ్మవారికి గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించి అనంతరం వినాయక ఘాట్‌లో నిమజ్జనం చేశారు.బొమ్మలసత్రం సాయిబాబా ఆలయంలోని దుర్గమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగవైభవంగా కోలాట నృత్యప్రదర్శన చేస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం సాయికమిటి సభ్యుల ఆధ్వర్యంలో కుందూనదిలో అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటి అధ్యక్షులు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సభ్యులు శివనాగేంద్రరెడ్డి,మదుమోహనరెడ్డి, పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు: దేవీశరన్నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని సిద్ధేశ్వరాలయం, కిషనసింగ్ వీధి, అంబా భవానీ, అర్బనకాలనీ విధుల్లో ప్రతిష్టించిన దుర్గాదేవీ అమ్మవారి నిమజ్జన మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలో అమ్మవారి శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ సమీపంలో వున్న శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వలో నిమజ్జనం చేశారు.
పాణ్యం: మండల కేంద్రంలోని అయ్యపురెడ్డి కాలనీలో ఫ్రెండ్స్ యూత కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గురువారం నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.