Job Appointments Delay: డీఎస్సీ అభ్యర్థుల నిరసన
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:11 AM
డీఎస్సీ-2025 ఉత్తీర్ణులైన మమ్మల్ని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. కానీ, ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు అని పలువురు డీఎస్సీ అభ్యర్థులు...
సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘డీఎస్సీ-2025 ఉత్తీర్ణులైన మమ్మల్ని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. కానీ, ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు’’ అని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయం గేటు బయట సోమవారం వారంతా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఉద్యోగానికి.. ఒక అభ్యర్థి (1:1) విధానంలో తమను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారని.. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాల్ లెటర్లు పంపిన తర్వాత సెలక్షన్ లిస్టులో తమ పేర్లు లేవని, రోస్టర్ పాయింట్ల పేరుతో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. మంత్రి లోకేశ్ తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు.