Billing Dispute: తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు..లారీ ఎక్కించి చంపేశాడు
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:59 AM
తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు ఓ డ్రైవర్ తన లారీని పైకి ఎక్కించి ఇద్దరిని చంపేశాడు! ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట సమీపంలోని...
మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఘాతుకం
దాబా యజమాని సహా మరో వ్యక్తి మృతి
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఘటన
కంచిలి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): తిన్నదానికి బిల్లు కట్టమన్నందుకు ఓ డ్రైవర్ తన లారీని పైకి ఎక్కించి ఇద్దరిని చంపేశాడు! ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంత్రకోట సమీపంలోని దాబా హోటల్ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కంచిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన లారీ డ్రైవర్ ఇబ్రార్ ఖాన్ బుధవారం రాత్రి భోజనం చేసేందుకు దాబా హోటల్‌కు వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకు భోజనం చేసి బిల్లు ఇవ్వకుండా వెళ్లిపోతుండగా.. దాబా యజమాని ఆయూబ్ (55) అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడ వ జరిగింది. అప్పటికే డ్రైవరు మద్యం మత్తులో ఉన్నా డు. ఆ తర్వాత లారీ ఎక్కి నడుపుకుని వెళ్తుండగా.. ఆపేందుకు అయూబ్ ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని మీదుగా నడిపించడంతో అయూబ్ అక్కడికక్కడే చనిపోయారు. ఇది గమనించిన మధుపురం గ్రామానికి చెందిన డొక్కరి దండాసి (65) లారీని ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో దాని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని సోంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. అక్కడున్న వారు లారీని వెంబడించి బురగాం సమీపంలో పట్టుకున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకు కేసు నమోదు చేశారు.